Help Cyclone-affected Farmers : తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, నవంబర్ 07, అనపర్తి నియోజకవర్గం, చoడ్రేడుగ్రామంలో తుపాను కారణంగా నష్టపోయిన వరి, మినుము రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, డిమాండ్ చేశారు. రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో దెబ్బతిన్న పంటలను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి చేనుకు ఎకరానికి రూ.25 వేలు, మినుముకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టామని, పంట చేతికందే సమయంలో తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.

అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రంగంపేట మండలంలో సుమారు 1500 ఎకరాలలో వరి, 2 వేల ఎకరాలలో మినుము పంటకు నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల నష్టపరిహారం అందించాలన్నారు.

పంటలు నష్టపోతే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని, కనీసం ఈ క్రాప్ నమోదు కూడా చేపట్టలేదని విమర్శించారు. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటనష్ట పరిహారం సకాలంలో అందించడం జరిగిందన్నారు. మినుము వేసిన రైతులు రెండు విధాలుగా, నష్టపోతున్నారని, చేతికందిన పంట నానిపోయి పాడైపోవడంతో పాటు, ఇప్పడు ఆ పం టను తీస్తేగానీ రెండో పంట వేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు. రైతులందరికీ నష్టపరిహారంతో పాటు ఉచితంగా శనగ విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government should help cyclone-affected farmers

You cannot copy content of this page

Scroll to Top