జిల్లా పోలీస్ కార్యలయం లో “వందే మాతరం” జాతీయ గీతం 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. –జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచిన “వందే మాతరం” జాతీయ గీతం 150 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని, వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో “వందే మాతరం” గీతం 150 సంవత్సరాల వేడుకలను జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులు,డిపిఓ సిబ్బంది,హోం గార్డ్స్ అధికారులు అందరూ సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. అనంతరం ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ “వందే మాతరం” గీతం మన స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిందని, ఈ గీతం భారత మాత పట్ల ఉన్న భక్తి, త్యాగం, మరియు దేశాభిమానానికి ప్రతీక అని తెలిపారు. ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తిని, ఐక్యతను, జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.జాతీయ గీతం పట్ల గౌరవభావాన్ని పెంపొందించాలని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఇట్టి కార్యక్రమం లో వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి ,ఏఆర్ డిఎస్‌పి వీరేష్ ,ఏఓ ఖజామోహోయోద్దీన్ ,డిఎస్‌బి ఇన్స్పెక్టర్ డివిపి రాజు , ఆర్‌ఐ లు అంజాత్ పాషా,డేవిడ్ ,ఎస్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐ లు,డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


