మా అధినేతను విమర్శించే స్థాయి నీకు లేదు…
సల్మాన్ హుస్సేన్ పై వైసీపీ నేతలు ఆగ్రహం….
అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టిన విషయాన్ని రైతులు మరవలేదు…
త్రినేత్రం న్యూస్, నవంబర్ 07, మండపేట , మండపేట టౌన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, ఆర్‌టీఐ వింగ్ కన్వీనర్ మందపల్లి రవి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓర్వలేక సల్మాన్ హుస్సేన్ ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను విమర్శించే స్థాయి నీకు ఉందనుకోవడం మీ అవివేకమన్నారు. మీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో మీరు గుర్తు చేసుకుంటే మంచిదని హితువు పలికారు.
మా జగన్ మోహన్ రెడ్డి, రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించి రైతులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడని గుర్తు చేశారు. ఇప్పటికీ నష్టపోయిన రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వని ప్రభుత్వం మీదని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. ఇన్సూరెన్స్ కట్టుకున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇస్తానని చెప్పడం మీ కూటమి ప్రభుత్వం కి సిగ్గుచేటన్నారు. ఇన్సూరెన్స్ కట్టకపోవడం మీ కూటమి ప్రభుత్వం చేసిన మొదటి తప్పుగా గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తున్న రైతులుకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పేరును ప్రచారం చేశారు తప్ప రైతులకు, కౌలు రైతులకు ఇచ్చింది శూన్యమని దుయపెట్టారు.
ఇన్సూరెన్స్ కట్టినా, కట్టకపోయినా రైతులను నష్టపరిహారం చెల్లించి రైతులకు అండగా నిలవాలన్నారు. జగన్‌మోహన్ రెడ్డి రైతులను, పరామర్శించడానికి వచ్చిన దాన్ని పబ్లిసిటీ అని తప్పుదారి పట్టించడం సిగ్గుచేయటన్నారు. కూటమి నాయకులకు రైతుల ప్రజాదరణ లేకపోవడం ఓర్వలేక ఇటువంటి తప్పుడు ఆరోపణలు, చేస్తున్నారన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారని మీరే చెప్పడం ఆశస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెలుసుకుని దేశానికి వెన్నెముకగా చెప్పు రైతులకు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని గుర్తు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


