Collection Signatures : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కోటి సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

ఏడిదగ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు
త్రినేత్రం న్యూస్ నవంబర్, 06. ఏడిద, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ,మండపేట మండలం లోని ఏడిద గ్రామంలో చేపట్టారు. ప్రైవేటీకరణ పేరుతో తమ తాబేదారులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను దిగజార్చే ఆలోచనలు తప్ప, వారికి మంచి చేయాలన్న ఆలోచన ఉండదని ప్రజలకు వివరిస్తూ ఈ సంతకాల సేకరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ. పసుమర్తి నాగబాబు ఎంపీటీసీ సభ్యులు పట్నాల నాగబాబు , తాతపూడి ఉషా రాజేష్.. వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి అర్జున్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర శీను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లూరి రామకృష్ణ బూరుగ జానీ విసుపురెడ్డి శివ , గంధం ప్రసాద్, చీకట్ల వినయ్, ఏవీ రెడ్డి, హరిదాసుల సూరిబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collection of one crore signatures

You cannot copy content of this page

Scroll to Top