డిండి (గుండ్ల పల్లి) నవంబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గల టీఎస్ మోడల్ స్కూల్లో 22 మంది విద్యార్థిని విద్యార్థులకు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఎన్ ఎం ఎం ఎస్ మెటీరియల్ ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిండి తహసిల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రశంసిస్తూ విద్యార్థులు వినియోగించుకుని మన మండలానికి మన గ్రామానికి తల్లిదండ్రులకు మెరిట్ టెస్టులో ఉత్తీర్ణులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏటి రాధిక కృష్ణ. రిటైర్డ్ ఎంపీడీవో తాడిశెట్టి సుదర్శన్. యూత్ ఫర్ సేవా సభ్యులు కడారి శ్రీశైలం, గాయాల రాఘవేందర్. మరియు జెడ్పిహెచ్ఎస్ మోడల్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


