త్రినేత్రం న్యూస్ పెనుమూరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభయాన్ ప్రతి ఇంట స్వదేశీ – ఇంటింటా స్వదేశీలో భాగంగా పెనుమూరు మండలంలో బిజెపి అధ్యక్షురాలు ఉషారాణి ఆధ్వర్యంలో ముత్యాలమ్మ గుడి ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్టిబాబు,సూరి విచ్చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ మండలంలోని నాయకులకు పై కార్యక్రమం గురించి వివరించడం జరిగింది.
తర్వాత మండల కేంద్రంలోని గాంధీ నగర్ లో ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ వస్తువులనే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేసి ఇంటి తలుపులకు స్టిక్కర్లను అంటించి కరపత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గిరిబాబు,మాజీ మండలాధ్యక్షుడు వాసుదేవ నాయుడు, సుబ్రహ్మణ్యం, గోపాల్, చంద్రశేఖర్ నాయుడు, రవి,చంద్రారెడ్డి,మహిళా మనులు రాజ్యలక్ష్మి, లతా తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


