Ramavat Ravindra Kumar : రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మెంథా తుపానుతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ…..ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి, లేదంటే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ తుపాన్ ఊహించలేనిది, రైతులకు జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది అని ఆయన అన్నారు.ధాన్యం తడిసిపోవడం, పంటలు నేలరాలిపోవడం, వరదల్లో కొట్టుకుపోవడం చూసి రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు అని ఆయన పేర్కొన్నారు.

ఆరుగాలం శ్రమించి కోతకు సిద్ధమైన పంట నీటిపాలైందని, రైతుల కష్టం వృథా అయిందని పేర్కొన్నారు.రైతుల బాధ వర్ణనాతీతమని, వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు.యూరియా, విత్తనాలు దొరకక, రైతు భరోసా ఆలస్యమై, ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నిజంగా ప్రేమిస్తే, వెంటనే నష్టపరిహారం రైతుల అకౌంట్లలో జమ చేయాలి అని డిమాండ్ చేశారు.మెంథా తుపాను రైతులకు కన్నీరు మిగిల్చిందని, వారిని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Compensation should be paid to the farmers

You cannot copy content of this page

Scroll to Top