Pawan Kalyan : పంట పొలాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్

TRINETHRAM NEWS

తేదీ : 30/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పంటను ఆయన పరిశీలించారు. చేతికి వచ్చే సమయంలో తుఫాను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వపరంగా రైతులను ఆదుకుంటామని పవన్ ధైర్యం చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan inspects crop fields

You cannot copy content of this page

Scroll to Top