–నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి .
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 29 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం భారీ వర్షాల నేపథ్యంలో దేవరకొండ డివిజన్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న షెడ్యూల్డ్ తెగల బాలుర హాస్టల్లోకి వర్షపు నీరు చేరడం పట్ల విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంగళవారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తు ఉండడం,కొమ్మే పల్లి ఎస్ టి వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం ,లోతట్టు ప్రాంతంలో ఉండడం వంటి కారణాల వల్ల హాస్టల్లోకి నీరు ప్రవేశించిందని తెలిపారు. అయితే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో విద్యార్థులను పక్కనే ఉన్న బీసీ హాస్టల్ లోకి తరలించామని చెప్పారు. ఎస్ టి రెసిడెన్షియల్ పాఠశాలలోని 500 మంది విద్యార్థులను, 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరిని అక్కడికి తరలించినట్లు ఆమె వెల్లడించారు. కొమ్మపల్లి పాఠశాల లోతట్టు ప్రాంతంలో ఉండడం, డిండి వాగు పక్కనే ఉండడం వల్ల నిరంతర వర్షం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో ఇలా కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని ఆమె వెల్లడించారు.
మొంథా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లో లెవెల్ కాజ్ వేలు, పొంగి ప్రవహించే రోడ్లు, బ్రిడ్జిలపై, వాగులు, వంకలు దాటవద్దని కోరారు. అలాగే నీటి పరివాహక ప్రాంతాల్లోకి, చేపలు పట్టేందుకు,బట్టలు ఉతికేందుకు వెళ్లవద్దని, పశువులను పొలాలవైపు తీసుకు వెళ్లవద్దని ఆమె కోరారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కొమ్మేపల్లి లో ఉన్న ఎస్టి వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలోకి పోలాల నుండి నీరు రావడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని, రెండు, మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులందరినీ అదనపు ఎస్పీ, సిఐ ల సహకారంతో వారి ఆధ్వర్యంలో ఫోర్స్ ఏర్పాటు చేసి విద్యార్థులందరిని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం పర్శ తండా వద్ద వర్ష పరిస్థితిని పరిశీలించారు. వర్షపు నీరు ఉదృతంగా వచ్చి తాండా చెరువులో చేరడం, ఒకవేళ చెరువుకు గండి పడితే తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై ఆమె అధికారులతో మాట్లాడారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక ,దేవరకొండ ఆర్ డి ఓ రమణా రెడ్డి,తహసిల్దార్ ,ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ,డేనియల్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


