Campaign : మాగంటి సునీత మద్దతుగా విస్తృత ప్రచారం

TRINETHRAM NEWS

ప్రచారం లో పాల్గొన్న నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ,మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 29 త్రినేత్రం న్యూస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత కు మద్దతుగా బోరబండ డివిజన్, సాయిబాబా నగర్ లో ప్రచారం చేసిన నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ . ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….గత దశాబ్దంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్‌లు, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, కిట్లు పథకాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాలను మార్చేశాయని తెలిపారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి హామీని నెరవేర్చలేకపోయిందని,4 వేల పెన్షన్ ఇవ్వలేకపోయింది, 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్న మాటను మరచిపోయింది, గృహలక్ష్మి పథకం ప్రజలకు దూరమైనది,ఇంటింటి వైద్య సేవలు నిలిపివేసింది,బతుకమ్మ చీరలు,గర్భిణులకు ఇచ్చే కిట్స్ నిలిపివేత రైతులకు మద్దతు ధరకే పంట కొనుగోలు జరగడం లేదని విమర్శించారు.

ప్రజలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో పొందిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని మరోసారి బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీత ను ఘన విజయంతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు బోరబండ బూత్ కమిటీ సభ్యులు దేవరకొండ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

campaign in support of Maganti Sunitha

You cannot copy content of this page

Scroll to Top