24 నాడు బీసీ సంఘాల మహా ధర్నా,ఇందిర పార్కు దగ్గర జరుగుతుంది.తెలంగాణ లో ఉన్న బీసీలుపాల్గొనలనీ నేతలపిలుపు.
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం,ప్రతినిధి,త్రినేత్రం న్యూస్,42% బీసీ ల రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యం లో ,24.10.2025 నాడు ఉదయం 9.00.గం.నుండి మహా ధర్నా ఇందిర పార్కు దగ్గర ఉంటుందన్నారు.ఈ ధర్నా ను పురస్కరించుకొని హైదరాబాద్ భషిర్బాగ్ ప్రెస్స్ క్లభులోజరిగిన మీడియా,విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ఓబీసీ మాజీ కమిషన్ చైర్మెన్ హై కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి.
ఈ శ్వరయ్య. ఇంట లేక్చవల్ పోరం ఛైర్మెన్ మాజీ IAS చిరంజీవులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ ధర్మ సమాజ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విషారధన్ మహారాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలగొని బాల్ రాజ్,బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మెన్ రాచాల యుగంధర్ గౌడ్ లు మాట్లాడుతూ,ప్రభుత్వాలు GO లు తీస్తే ,బీసీ లకు రిజర్వేషన్ లు అమలు కావన్నారు.అఖిల పక్షాలను పార్లమెంటుకు తీసుక వెళ్ళి చర్చలు జరిపి రాష్ట్రపతి చే ఆమోదం తెలుపాలన్నారు,తమిళ నాడు తరహాలో బీసీ రిజర్వేషన్ లు అమలు కావలన్నారు. బీజేపీ, కాంగ్రెస్,బి ఆర్ ఎస్ ముఖ్యంగా 3 పార్టీలు తెలంగాణలో బీసీ లకు 42% రిజర్వేషన్ అమలు చేయడం లో చిత్త శుద్ధి లేదని విమర్శలు చేశారు.
బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండ మాట్లాడడం సరియైన విధానం కాదన్నారు.మొన్న 18 నాడు జరిగిన రాష్ట్ర బంధులో అన్ని పార్టీలు బీసీ ల రిజర్వేషన్ ల కొరకు మద్దతు ప్రకటించడం చాలా చిత్రంగా ఉన్నదని,78 సంవత్సరాలు బీసీ లను మోసం చేసింది సరిపోలేదా,ఇంకా మోసం చేయాలని చూస్తున్నఆయా పార్టీలు,పాలక పార్టీల మద్దతు తో కొన్ని బీసీ సంఘాలు పని చేయడం అమాయక బీసీ లను మోసం చేయడం అవుతుందన్నారు.రేపు జరుగబోయే బీసీ ల మహాధర్న లో బీసీ ల రిజర్వేషన్ లకు శత్రువు లు ఎవరో ,అనుకూలూరు ఎవరో గుర్తిస్తామన్నారు.రాష్ట్ర నలుమూల ల నుండి బీసీ లు స్వచ్ఛందంగా ఉదయమే ప్రారంభ మయ్యే బీసీ ల మహాధర్నా లో పాల్గొనాలని బీసీ లందరికీ విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


