Ration Distribution : రేషన్ పంపిణీలో మార్పులు

TRINETHRAM NEWS

తేదీ : 22/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. బియ్యంతో పాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు షాపులు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. అదేవిధంగా అరవై ఐదుఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు.ఇక కార్డ్ హోల్డర్లు సమీపంలోని ఏ రేషన్ షాపులో నైనా సరుకు తీసుకునే పోర్టబిలిటీ సదుపాయమూ అందుబాటులోకి రానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Changes in ration distribution

You cannot copy content of this page

Scroll to Top