సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పూలే మార్ట్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముదిరాజ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పూలే మార్ట్ చైర్మన్ బీరయ్య యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికి, సన్మానం చేశారు.
పూలే మార్ట్ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలపై మాణిక్యం ముదిరాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక అవగాహన, స్వయం ఉపాధి ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో సంస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో నేటివ్ ఇండియాన్స్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బత్తుల విక్రమ్, గొల్ల శేఖర్, పూలే మార్ట్ కార్పొరేట్ కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగి, ముగింపు సందర్భంగా అతిథులతో సంస్థ ప్రతినిధులు స్మారకచిహ్నాలను అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


