Ramavat Ravindra Kumar : అందరూ అభయాంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

-దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 22 త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ శ్రీ అభయాంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి అని.. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం చింతపల్లి మండలం దేన్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గాసిరాం తండాలో శ్రీ అభయాంజనేయ స్వామి 6వ వార్షికోత్సవం కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమావత్ కొండల్, మత్య నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ హరి నాయక్, జబ్బర్, సుందర్, గౌరాజ్,తరుణ్,పుల్ సింగ్,వినోద్,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the blessings of Abhayanjaneya Swamy

You cannot copy content of this page

Scroll to Top