సహకరిస్తున్న అధికారులు..
MRPS -TS జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య.
చిట్యాల మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. చిట్యాల మండలంలోని నవాబ్ పేట గుట్టల్లో అక్రమ మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలు గా విలసిల్లుతుందని, ఈ దందా అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని MRPS-TS జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన అధికార పార్టీకి చెందిన కొంతమంది అక్రమంగా మొరం తవ్వుతున్న నవాబ్ పేట గుట్టలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలపై కొంతమంది అధికార పార్టీ నాయకుల కన్ను పడిందని,వారి అక్రమ సంపాదన కోసం మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని,ఇట్టి విషయమై సంబంధిత అధికారులు స్పందిస్తే అధికార పార్టీ నాయకులమని, మ్మెల్యే అనుచరులమని అధికారులను బెదిరిస్తున్నారని నియోజకవర్గంలో మ్మెల్యే అనుచరులు ఇష్టారీతినా వ్యవహారిస్తూన్నారని, అందువల్ల సంబంధిత అధికారులు చూసి చూడనట్లువ్యవహరిస్తున్నారని ,
ఈ దందా ఇలాగే కొనసాగితే పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తతంగం జరుగుతున్న సంబందిత మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని,ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ మొరం తరలిస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో mrps-ts మండలం అధ్యక్షులు రేణుకుంట్ల రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


