DPL-10 Cricket Tournament : DPL-10 క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవం

TRINETHRAM NEWS

విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన DPL-10 క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన విన్నెర్ జీకా టీం మరియు రన్నర్ అప్ HARISH-11 టీం జట్లకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు బహుమతులు అందజేస్తూ క్రీడాకారులను అభినందించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, పట్టుదల,జట్టు స్పూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు,యువత దేశ భవిష్యత్తు అని,వారు చదువుతో పాటు క్రీడలలోనూ ప్రతిభ చూపి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు,క్రీడా మైదానంలో చూపించే కృషి, క్రమశిక్షణ జీవితంలో కూడా విజయానికి దారి తీస్తుందని పేర్కొన్నారు,అదే విధంగా యువత సామాజిక సేవ, ప్రజాసేవ రంగాల్లో ముందుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ యువతకు ప్రోత్సాహంగా నిలుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DPL-10 Cricket Tournament Prize

You cannot copy content of this page

Scroll to Top