దేవరకొండ డివిజన్ అక్టోబర్ 19 త్రినేత్రం న్యూస్. మాస్టర్ గోపి పర్యవేక్షణలో దేవరకొండ నియోజకవర్గం వివిధ మండలానికి చెందిన విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో సుమారు 42 మంది విద్యార్థులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంక రెడ్డి పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బెల్టులు సర్టిఫికెట్స్ వారి చేతుల మీదగా అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు మహిళల మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి కరాటే ఎంతో అవసరమని కరాటే నేర్చుకోవడం వలన మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారని ఎలాంటి పరిస్థితుల్లోనైనా మహిళలు బాలికలు ఎలాంటి దాడులకైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అని సూచించారు కాబట్టి ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ గోపీనాయక్ ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సిఐ సూచించారు ఈ కార్యక్రమంలో దేవరకొండ స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ల సురేష్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, … నాయక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జామినర్ గోపి నాయక్.సీనియర్ కరాటే మాస్టర్ లచ్చిరాం. లక్పతి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


