త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండల కేంద్రంలో నిత్యం చాలా వెహికల్స్ ఇతర జిల్లాలకు వెళుతూ ఉంటాయి. మరి బుధవారం సంతరోజైతే రోడ్డుమీద మనుషులు నడిచిపోవడం కూడా కష్టంగా ఉంటుంది. అందువల్ల పెనుమూరులో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. బస్టాండ్ తూర్పు వైపున 0.5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును నిర్మిస్తే ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్ లో ఉందని, గతంలో రాకపోకలు కూడా జరిగేవన్నీ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


