వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి,త్రినేత్రం న్యూస్.15.బుధవారం వినాయక కన్వెన్షన్ విఐపి హల్ లో బీసీ ల సన్నాహాక సమావేశం.K.రాజకుమార్ ముదిరాజ్,బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర బీసీ జేఏసీ యువజన కార్యనిర్వహక అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో సమావేశం భారీగా జరిగింది.రాష్ట్ర బీసీ జేఏసీ ఈ నెల 18.10.2025 శనివారం బంధు నిర్వహించడం,కొరకు సమావేశం జరిగింది,ఇందు లో బీసీ కుల సంఘాల నాయకులు,అన్ని రాజకీయ పార్టీల లో ఉన్న బీసీ నాయకులు,వివిధ ప్రజా సంఘాల నాయకులు,బీసీ న్యాయవాదులు,బీసీ డాక్టర్లు,బీసీ మహిళల సంఘాల నాయకురాలు,భారీగా పాల్గొన్నారు.ముందుగా బీసీ సంఘం సీనియర్ నాయకులు,జర్నలిస్ట్ అబ్నినీ బసయ్య ముదిరాజ్,స్వాగత ఉపాన్యాసం ఇస్తూ,బీసీ లకు 42% రిజర్వేషన్ లు ఇవ్వడం దానిని మాధవరెడ్డి అనే వారు కోర్టుకెళ్ళి రద్దు చేయించడం, ఇది ఎప్పటినుంచో అగ్రవర్ణాలు బీసీ లపై కుట్రతో బీసీ ల రిజర్వేషన్ లు రద్దు చేస్తున్నారన్నారు.
అట్లా బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా చేసిందని, ఆవేదన వ్యక్తం చేస్తూ,ఎసి ఎస్ టి లకు రిజర్వేషన్ లు అంబేద్కర్ కల్పించారు,బీసీ లకు జనాభా ప్రాతిపదికన, 79 సంవత్సరాలలో జనగణన ఎంత? అనేది దేశంలో జాతీయ పాలక,ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చేతన కావడం లేదని విమర్శించారు,1953 లో బీసీ పరిస్థితుల అధ్యయనానికి కాక కాలేల్కర్ కమిషన్,దీని నివేదికను అనుసరించి 2399 బీసీ కులాలు గుర్తించారు.1978 బి.పీ.మండల కమిషన్ వేశారు, ఈ కమిషన్ 3743 బీసీ కులాలుగా గుర్తించి నివేదిక ఇచ్చారు.రాష్ట్రంలో1966 లో అనంతరామన్ కమిషన్ వేశారు.1981లో మురళీధర్ రావు కమిషన్ వేశారు ఎన్టీఆర్ రామరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీ లకు 44% రిజర్వేషన్ ఇచ్చారు,అగ్రకులాలవారు,వెలమ,రెడ్లు,కమ్మ,వారు ప్రతి సారి బీసీ ల రిజ్వేషన్ లను రద్దు చేస్తున్నారని సవివరంగా తెలియచేశారు.ఇందులో పాల్గొన్నబీసీ నాయకులు రవిగౌడ్ జిల్లా కో ఆఫ్ రేట్ చైర్మెన్,రాజ్ గౌడ్ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మెన్,డాక్టర్ సంపత్ కుమార్,యూ.రమేష్ కుమార్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి,నీరజ బాల రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మెన్ ,తలారి వీరప్ప ముదిరాజ్ .పి.రామకృష్ణ ఉపన్యాసాకులు,సుభాష్ రిటర్డ్ టీచర్ ,మాజీ కౌన్సిలర్ సోమన్న,మురళిగౌడ్,ప్రభాకర్ గౌడ్ మాజీ కౌన్సిలర్,సీపీ ఎం.శ్రీనివాస్,కేవీప్స్, మల్కాయ,కె వి పి ఎస్
, చెంద్రప్ప, పటేల్ విజయ్ కుమార్ బీజేపీ,సుదర్శన గౌడ్ బీజేపీ,అనిత ముదిరాజ్,తదితరులు బీసీ ల నాయకులు పాల్గొన్నారు.18 నాడు మొదలు ప్రారంభం జరిగి “మెమెంటో మాకంత “బీసీ ల రిజర్వేషన్ 42% అమలయ్యేవరకు అన్ని రాజకీయ పార్టీల జెండా ఎజెండాలు ప్రక్కన పెట్టాలని,శత్రువులు ఎవరో తెలిసి పోయిందని,వచ్చే స్తానిక ఎన్నికలలో కూడ జడ్పీటీసీ,లు,జిల్లా పరిషత్ చైర్మెన్,ఎంపీపీ,లు బీసీ సర్పంచులను బీసీ లను చేయాలని,రెడ్డి నాయకత్వం బీసీ లకు ఇకనుంచి అవసరం లేదని,ఎమ్మెల్యేలు కూడ రెడ్డి లు నిలబడిన బీసీలు ఓట్లు వేయవద్దని బీసీ లనే ఎమ్మెల్యేలను నిలబెట్టి గెలిపించుకోవాలని “ఓట్లు మనవే సీట్లు మనవే” అంటూ ముక్తా కంఠంతో తెలియ జేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


