MLA Gorantla : పుష్కరాల నాటికి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తాం

TRINETHRAM NEWS

ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిత తనిఖీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 10. రాజమండ్రి రూరల్ పుష్కరాల నాటికి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని రూరల్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈరోజు ఉదయం ధవలేశ్వరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిత తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాలేజీ నందు అనేక అవకతవకలు జరిగాయని లక్షలాది రూపాయలను దారి మళ్లించారని, కాలేజీ ఆవరణలో కలిగిన కళ్యాణ మండపాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని వీటన్నిటిపై విచారణ జరుగుతుందని, త్వరలో దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలేజీ నందు విద్యార్థులకు అవసరమైన అనేక విషయాలపై సిబ్బందితో చర్చించారు.

అనంతరం లక్ష్మీ జనార్ధన స్వామి కొండపై ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలించారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని రద్దు చేయడం వలన, గ్రామంలో మంచినీటి సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, నూతన వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, పేపర్ మిల్ మరియు కొన్ని సంస్థల సహకారంతో త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండురి అప్పారావు, తలారి మూర్తి, పుక్కళ్ళ రాజు,సావాడ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల ఆనందరావు, వర్రె రాజేష్, గుర్రాల వెంకట్రావు, ఒంటెద్దు స్వామి, ఎస్.శివాజీ, ఎంపీడీవో సునీల్ ఆర్మ్ స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will solve all the problems

You cannot copy content of this page

Scroll to Top