త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 10. అనపర్తి, బ్రహ్మానంద టీవీ షో రూమ్ అండ్ హోమ్ నీడ్స్ లో జీఎస్టీ ఆఫీసర్ రామనాథ, అనపర్తి వర్తక సంఘం, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది. జీఎస్టీ ఆఫీసర్ రామనాథ్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు ఇటు వ్యాపారస్తులకు, అటు వినియోగదారులకు చాలా మేలు చేకూరుతుందని అన్నారు. అలాగే బ్రహ్మానంద టీవీ అండ్ హోమ్ నీడ్స్ అధినేత గ్రంధి రాంబాబు మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీలు 28 శాతం నుండి 18శాతం వరకు జీఎస్టీ తగ్గిందని, డిష్ వాష్ లు,ఎల్ఈడి టీవీలునలభై ఇంచులు పైన టీవీలు,28శాతం నుండి18శాతంకి జీఎస్టీ తగ్గిన కారణంగా మాకు వ్యాపారం పెరిగిందని, అలాగే వినియోగదారులకు ఖర్చు తగ్గిందని మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ కార్యక్రమం అనపర్తి వర్తక సంఘం ప్రెసిడెంట్ కొవ్వూరి వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ వారాకుమారి, మండల బిజెపి ప్రతినిధి తాడి గంగిరెడ్డి,టిడిపి అనపర్తి మండలం ప్రెసిడెంట్ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (దత్తుడు డు శీను), మామిడిశెట్టి శీను, వర్తక సంఘం ప్రతినిధులు తాడి సూర్యనారాయణ రెడ్డి జాయింట్, సెక్రెటరీ,మేడపాటి సత్యనారాయణ రెడ్డి (అన్నవరం ట్రెజరర్), నల్లమిల్లి ఈశ్వరరెడ్డి సెక్రటరీ,చింతా వీర్రాఘవ రెడ్డి (సిరి రాఘవ) జాయింట్ సెక్రెటరీ,తదితర వర్తకులు, పంచాయతీ సెక్రెటరీ రాము,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


