BRS leaders join Congress పూడూరు మండలం మేడిపల్లి కలాన్ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరిక

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి: పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.బిఆర్ఎస్ పార్టీకి చెందిన వెంకట రెడ్డి, ఇంద్రా రెడ్డి, తెలుగు నర్సింహులు, బాలరాజు, శ్రీకాంత్, అనుక్, పత్తి వెంకటేష్ తదితరులు సహా సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ… *“ప్రజల కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఆకర్షణగా మారాయి.అందుకే ఈ రోజు కాంగ్రెస్ కుటుంబంలో చేరుతున్నాము.పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నిరంతరం కృషి చేస్తున్నారు.గ్రామాల సమస్యలను పరిష్కరించడంలో,ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపుతున్న చొరవ మాకు ఎంతో ప్రేరణనిచ్చింది.అందుకే ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం” అని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leaders join Congress

You cannot copy content of this page

Scroll to Top