Methuku Anand : KCR kit Disappear : కాంగ్రెస్ ప్రభుత్వంలో కెసిఆర్ కిట్ మరియు బతుకమ్మ చీరలు మాయం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బి ఆర్ ఎస్ భవన్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో వికారాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ మహిళా నేతలతో సమావేశం అయ్యారు.సమావేశంలో భాగంగా వారితో అనేక రాజకీయ విషయాలు చర్చించిన అనంతరం ఆయన మహిళల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
కెసిఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత, సముచిత గౌరవం లభించాయి. ముఖ్యంగా రాజకీయ పరంగా దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలను సగం స్థానాల్లో పాలకులను చేసిన ఘనత ది.ఆడశిశువు పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు వివిధ దశల్లో అండగా నిలిచి, ఆత్మైస్థెర్యంతో ముందుకు నడిపించేలా అనేక సంక్షేమ పథకాలు లోపం లేకుండా అమలు జరిగాయి.
హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గర్భవతుల/ బాలింతల సంరక్షణ కోసం ప్రభుత్వ వాహనాలు పెట్టి ఇంటి నుండి ఆసుపత్రికి తీసుకు వచ్చి, అవసరం అయినా అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, తిరిగి వారిని ఇంటి దగ్గర దింపేది. కానీ ఇప్పుడు సొంత డబ్బులతో ప్రైవేట్ వాహనాల్లో రావలసిన భారం ఏర్పడింది.
కెసిఆర్ హయాంలో గర్భవతులకి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అలాగే తల్లి బిడ్డ సంరక్షణ కోసం కెసిఆర్ కిట్ అందించి వారి ఆరోగ్యం మీద ద్రుష్టి సారించారు. ఇప్పుడు అవి పూర్తిగా మాయమయ్యాయి.
తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. అట్లాంటి బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే చీరలు సైతం కాంగ్రెస్ పాలనలో ఆగిపోయాయి.
కెసిఆర్* హయాంలో ప్రతి ఇంటికి నీరు అందించిన మిషన్ భగీరథ* పథకాన్ని సక్రమంగా అమలు చేయడం చేతకాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు బిందెలతో రోడ్డు మీదకు రావలసిన పరిస్థితిని తీసుకొచ్చింది.
కెసిఆర్ పాలనలో మహిళలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన షీ టీమ్స్ అద్భుతమైన ఫలితాలను సాధించాయి. కానీ కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పి మహిళలపై హత్యలు, మానభంగాలు వంటి నేరాలు విపరీతంగా పెరిగాయి.
మహిళలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైంది
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని గొప్పలకు పోయిన రేవంత్ రెడ్డి.. కెసిఆర్* హయాంలో ప్రారంభమై సమర్థవంతంగా సాగిన సంక్షేమ పథకాలను కూడా నిలిపివేశారు.
మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.2,500 హామీ ఏమైంది అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌కు వేతనాలు పెంచుతామన్న హామీ ఏమైంది మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఫ్రీబస్‌ సర్వీస్‌ కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు బస్సు చార్జీలు మరియు విద్యార్థుల బస్‌పాస్‌లు కూడా పెంచి సామాన్యులను అడ్డంగా దోచుకుంటుంది.
ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి గాను బి ఆర్ ఎస్ పార్టీ తీసుకువచ్చిన బాకీ కార్డు లను గ్రామాల్లో ఇంటింటా పంపిణి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగళ్ళ అశోక్, మండల జనరల్ సెక్రెటరీ శివకుమార్, మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు గయాజ్, మండల SCవిభాగం అధ్యక్షులు శ్రీనివాస్, మండల BC విభాగం అధ్యక్షులు మల్లేష్ యాదవ్, మండల STవిభాగం అధ్యక్షులు మహిపాల్ నాయక్, మండల యువజన విభాగం అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కవితా ఉపేందర్ రెడ్డి, నాయకులు నర్సింహా, రాములు, వెంకటేశం గౌడ్ మరియు వివిధ గ్రామాల మహిళా నేతలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KCR kit and Bathukamma sarees disappear

You cannot copy content of this page

Scroll to Top