50 ఏళ్లుగా సమాజ సేవలో లయన్స్ సేవలు అభినందనీయం.. గవర్నర్ కోదండరాం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా కోఆర్డినేటర్ బంక రామస్వామి సారధ్యంలో 737 రోజులుగా నగరంలోని పేదలకు నిర్విరామంగా నిత్య అల్పాహార వితరణ చేపడుతున్నారు. దిగ్విజయంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షులు వడ్లకొండ ఎల్లప్ప, కార్యదర్శి ముడతనపల్లి సారయ్య, కోశాధికారి రాజేంద్ర కుమార్ అధ్యక్షతన మంగళవారం సోమారపు భారతి- సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని అల్పాహార వితరణ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్320జీ గవర్నర్ సింహరాజు కోదండరాం, అతిథులు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, హనుమండ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, రామగుండం లైన్స్ క్లబ్ శాశ్వత ప్రాజెక్టుల్లో భాగంగా ఈ ప్రాంత అంగ వైకల్యులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నారని, మినరల్ వాటర్ ప్లాంట్ తదితర కార్యక్రమాలలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంత పేద ప్రజలకు నిత్య అల్పాహార వితరణ చేస్తూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, కజంపురం రాజేందర్, పి మల్లికార్జున్, తానిపర్తి విజయలక్ష్మి- గోపాలరావు, గుండ వీరేశం, గుడ రాజు తో పాటు స్థానిక లైన్స్ క్లబ్ సభ్యులు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


