Bantwaram MPP candidate : బంట్వారం ఎంపీపీ స్థానాన్ని ఆశిస్తున్న ఉద్యమకారుడు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మైనారిటీ నేతకు బిఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించేనా. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు మిక్కిలి సన్నిహితులు తెలంగాణ ఉద్యమంలో ఖాజా పాషా కీలక పాత్ర బంట్వారం:స్థానిక పోరులో భాగంగా బంట్వారం ఎంపీపీ స్థానం బీసీ జనరల్ కాగా బంట్వారం ఎంపీటీసీ స్థానం జనరల్ కేటగిరి కి కేటాయించారు, ఉద్యమ కాలం నుండి గులాబీ జెండాతోనే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఖాజా పాషా గతంలో మండల రైతు బంధు అధ్యక్షులుగా కొనసాగారు, ఉవ్వెత్తున ఎగసి పడిన తెలంగాణ ఉద్యమ జెండాను అందుకొన్న ఉన్నత విద్యావంతుడిగా మారుమూల ప్రాంతం రాష్ట్ర సరిహద్దులో సమర్థవంతంగా ఉంద్యమంలో ముందు నడిచిన మైనారిటీ నేత, గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి వరించేలోపే పార్టీలు మారి అధికార దాహంతో బిఆర్ఎస్ లో చేరినవారి కుట్రలకు బలైపోయాడు, రెండవసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అది గుర్తించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖాజా పాషా కు రైతుబంధు మండల అధ్యక్షులుగా అవకాశం కల్పించారు, రాజకీయ క్షేత్రంలో గెలవాలన్న ఖాజా పాషా కు ఎంపీపీ అవకాశం ఇవ్వాలన్నది బంట్వారం మండల ప్రజల, ఉద్యమకారుల కోరిక, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు మిక్కిలి సన్నిహితులైన ఉద్యమ కారునికి అధికారం లేని సమయంలోనైనా బిఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూద్దాం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bantwaram MPP candidate

You cannot copy content of this page

Scroll to Top