నికర లాభాలను నుండి బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన యాజమాన్యం
లాభాలకు సమభాగం పోషించిన కాంట్రాక్ట్ కార్మికులకు బోనసులో మొండిచేయి.
గ్లాబిక్స్ అధ్యక్షులు ఎస్.వి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 40 వేల గనికార్మికులు 35వేల కాంట్రాక్టు కార్మికులు సమిష్టిగా చేసినకృషిఫలితంగా 6390కోట్లరూపాయలులాభాలు వచ్చాయని అందు లో 3 వంతులు దారి మళ్లించి రెండు వేలుప్రకటించిబోనసుప్రకటించ డంఅన్యాయమని,బొగ్గుగనుల అమ్మకాలకుకాంగ్రెసుప్రభుత్వం అనుమతించటందానికిగుర్తింపు,ప్రాతినిధ్య సంఘాలువిజ్ఞప్తి చేయటం సింగరేణి సంస్థకు ప్రమాదకరమైందని కార్మికుల మనుగడకుఉరితాడులాంటిదని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఎస్. వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి.
శ్రీనివాస్ లు అన్నారు.కంపెనీకి వచ్చిన మొత్తం లాభాల నుండి బోనసును చెల్లించాలని,లాభా లలోసమభాగంగాఉన్నకాంట్రాక్టు కార్మికులకు 5500ఇవ్వటం అవమానకరమైందని ఇది కాంట్రాక్టుకార్మికులనుఅవహేళన చేయటం యాజమాన్యా నికి తగదనివారు అన్నారు గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన సింగరేణి ప్రాంత ముఖ్య కార్యకర్తల సమావేశం ఐ కృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ యంత్రాంగానికి లొంగిపోతున్నదని రాజకీయ జోక్యాన్ని సింగరేణిలో పెంచడం వల్ల పరిశ్రమకు నష్టకరమైన పరిస్థితి తలెత్తింద ని వారు అన్నారు.సింగరేణి యాజమాన్యం తన ఆలోచన ధోరణిని మార్చుకొని సింగరేణి పరిశ్రమను బతికించేందుకు బొగ్గుగనుల అమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడాలని కంపెనీలో కొత్త బొగ్గు బావులను తీయాలని ఉద్యోగ ఉపాధిని కల్పించాలని కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడాలని అన్నారు.
ఈ సందర్భంగా సీసీ,వ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో చెల్లిస్తున్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిఎల్ బికేఎస్ ప్రధాన కార్యదర్శి జే.సీతారామయ్య,సింగరేణికాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న, అధ్యక్షులు ఎండి.రాసుద్దీన్, ఇ.నరేష్,ఇధునూరి రామకృష్ణ,రాజేశం,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


