Navratri Mahotsavam : ఘనంగా దసరా శరన్న నవరాత్రి మహోత్సవాలు

TRINETHRAM NEWS

తేదీ : 29/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం , మండలం, గ్రామంలో దసరా శరన్న నవరాత్రి మహోత్సవాలు లో భాగంగా అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరారు. పూజలు నిర్వహించారు. ఆ గ్రామ కమిటీ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పూజ సామాగ్రి పంపిణీ చేశార. జీలుగుమిల్లి మండలం , లక్ష్మీపురం ఆలయ కమిటీ వాళ్లు కె. కే నాగేశ్వరరావు, పి. కృష్ణ, రమేష్, వెంకటేశ్వరరావు, నవీన్, ప్రమోద్ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు.

గుర్రాల .సురేష్ సతీమణి సుజాత వాళ్ళ పిల్లలు పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రతి ఒక్క కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు, రాకుండా, లేకుండా వాళ్లు చేసే వృత్తులలో సిరి సంపదలు కలగాలని, మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా జీవించాలని పూజలు చేసేమని పేర్కొన్నారు. వచ్చేనెల అనగా అక్టోబరు ఒకటి వ తేదీన మహా అన్నసమరాధన మరియు రెండు వ తారీకు న ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలో అశ్వరావుపేట రోడ్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న కనకదుర్గ ఆలయం వద్ద మరియు ఆ గ్రామ దేవత గంగానమ్మ సరస్వతి దేవిగా దర్శనమిచ్చిందని ఆలయ కమిటీ వాళ్ళు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand Dussehra Sharanna Navratri Mahotsavam

You cannot copy content of this page

Scroll to Top