SC Leaders Demand : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లల్లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం

TRINETHRAM NEWS

కలెక్టర్, ఆర్డీఓ లకు వినతిపత్రాల సమర్పణ
ఎస్సీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసిన ఎస్సీ నాయకులు .

దేవరకొండ సెప్టెంబర్ 29: త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం విడుదలైన రిజర్వేషన్ల జాబితా దేవరకొండ నియోజకవర్గంలో పెను రాజకీయ తుఫానును సృష్టిస్తోంది. నియోజకవర్గంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా, వారి హక్కులను కాలరాసే విధంగా రిజర్వేషన్లను రూపొందించారని ఆరోపిస్తూ, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, నల్గొండ జిల్లా కలెక్టర్‌కు సైతం తక్షణమే రిజర్వేషన్లను చట్టబద్ధంగా సవరించి, ఎస్సీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.
దేవరకొండ నియోజకవర్గంలో ఎస్సీ జనాభా దాదాపు లక్ష వరకు ఉంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య కూడా యాభై వేలకు పైగానే ఉంది. నిబంధనల ప్రకారం, జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉండగా, ఈ కీలక జనాభా విభాగానికి పూర్తిగా మొండిచేయి చూపడం రాజకీయంగా, సామాజికంగా కలకలం సృష్టిస్తోంది. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ) స్థానాలను కలిపితే మొత్తం 16 కీలక పదవులు ఉండగా, ఈ పదహారు సీట్లలో ఒక్క స్థానాన్ని కూడా ఎస్సీలకు రిజర్వు చేయకపోవడం అత్యంత దారుణమని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు స్థానిక అభివృద్ధి, నిధుల కేటాయింపులో కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి, వాటిని పూర్తిగా ఎస్సీలకు దూరం చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన దేవరకొండ నియోజకవర్గంలో ఎస్సీ ప్రాతినిధ్యాన్ని లేకుండా చేసేందుకు రాజకీయ కుట్రలు, తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులను తుంగలో తొక్కారు అని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ యేకుల రాజారావు, అంకూరి నర్సింహా,ఎర్ర కృష్ణ, యేకుల సురేష్, ,పోట్ట మురళి,కంబాలపల్లి అనంద్, కంబాలపల్లి వెంకటయ్య, సందరయ్య, నూనె సురేష్,మేడ సైదులు, బత్తుల దినకార్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SCs are being severely unfairly treated

You cannot copy content of this page

Scroll to Top