త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. ఈరోజు బంట్వారం మండలం మాల సోమారం, తొర్మామిడి మరియు బంట్వారం గ్రామాలలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటనలో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్టులు, శిథిలావస్థకు చేరుకున్న ఇల్లు, దెబ్బతిన్న మిషన్ భగీరథ పైపులు, విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు.
రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతన్నకు పంట నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా మరియు విధ్యుత్ వ్యవస్థలు పునరుద్ధరించాలి. అలాగే గ్రామాల్లో ఆవాసాల మధ్య చేరిన వర్షపు నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


