Minister and MLAs : విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి, శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పిడుగురాళ్ల టౌన్ గంగానమ్మ సెంటర్ నందు పదకొండు వ శతాబ్దంలో అఖండ పల్నాడును స్థాపించి పరిపాలించిన మహావీరుడు అనుగురాజు. యాదవ్ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు యరపతినేని. శ్రీనివాసరావు తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుగు రాజు. యాదవ్ తెలుగుదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిన వీరుడని, అప్పట్లో ఆయన పాలనలో శ్రేయస్సుతో కూడిన సౌర్యంతో నిలిచింది

ఈ జిల్లా అని తెలిపారు. గర్వ కారణమైన ఈ మహానీయుడు విగ్రహం తరతరాలకు ప్రేరణ నిస్తుంది. యువతలో చారిత్రక చైతన్యం పెంపొందించడంలో ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు యం. కొండయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జంగా. కృష్ణమూర్తి, మహనీయుడి ప్రతిమకు పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The statue was unveiled by the Minister and MLAs

You cannot copy content of this page

Scroll to Top