Financial Assistance : ప్రాంతo ఏదైనా సహాయం చేయడమే నీడ లక్షణం

TRINETHRAM NEWS

మద్దెల సుగుణ క్యాన్సర్ చికిత్స కి నీడ సంస్థ పదివేల రూపాయల ఆర్థిక సహాయం.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మద్దికుంట గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన మద్దెల సుగుణ వయసు 55 సంవత్సరాలు గత సంవత్సర కాలం నుండి గర్భసంచి క్యాన్సర్ తో బాధపడుతుంది పేదరికం కారణంగా సరైన చికిత్స అందించకుండా ఉండడంతో వ్యాధి తీవ్రత పెరిగింది. దీoతో మంచాన పడిన సుగుణకు, భర్త అనారోగ్యం కూడా తోడవడంతో దిక్కుతోచని పరిస్థితిలో వీరి కుటుంబం ఉంది. నీడ మెంబెర్ ఎండ్ రఫీ ద్వారా విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ తక్షణమే క్యాన్సర్ చికిత్స కోసం మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూపు నుండి
పదివేల రూపాయల ఆర్థిక సాయంను రేగడి మద్దికుంట గ్రామానికి వెళ్లి నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదగా అందించడం జరిగింది. జరిగినది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ దీనగాథలు ఎక్కడ ఉన్నా నిజమైన నిసహాయ పేషెంట్ల దగ్గరకి నీడ వెళ్లి తప్పకుండా సాయం చేస్తుందని దానికి ఈ కార్యక్రమమే నిదర్శనం అని తెలిపారు.సుగణకి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని క్యాన్సర్ చివరి స్థాయిలో ఉన్న సుగుణకి ఆరోగ్యశ్రీ ద్వారా రేడియేషన్ ఉచితంగా చేస్తామన్నా కూడా పరీక్షలు ఇతర ఖర్చులకు సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయలు అవుతాయని వారి కుమార్తెలు ఇప్పటివరకు ఆస్పత్రిలో ఖర్చులు పెట్టామని మా దగ్గర కూడా డబ్బులు లేవని తెలిపారు. దీంతో నీడను సంప్రదించగా 10000 రూపాయల ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడ సభ్యులు ఎండి రఫీ, స్వర్ణలత, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

help in any way

You cannot copy content of this page

Scroll to Top