Meeting with the MLAs : గోదావరిఖని క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి మరియు అంతర్గం మండలాల ముఖ్య నాయకులు, తో సమావేశం ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గ్రామ స్థాయి నుండి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, గెలుపు కోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే, ప్రజలతో ఎప్పటికప్పుడు సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు సమష్టిగా పనిచేయాలని ఆయన నేతలను, కార్యకర్తలను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Meeting with the MLAs of Palakurthi

You cannot copy content of this page

Scroll to Top