త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 26, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండపేట పట్టణం పార్థసారథి నగర్ లో గల చిన్న మసీదులో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారన్నారు. మహిళలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు.
అనంతరం ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ వి.భవాని ను శాలువా కప్పి సన్మానించారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు నీలం దుర్గ,మొండి భవాని,ఆర్థో పెడిక్ డాక్టర్ రాము,గైనకాలజిస్ట్ జోతిర్మయి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది,ఎ.ఎన్.ఎమ్ లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు,అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


