మద్యపాన నిషేధ మరియు ఆబ్కారి అధికారి కే జీ నందగోపాల్ వినతి పత్రం
బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మద్యపాన నిషేధ మరియు అబ్కారీ శాఖ అధికారి కే జీ నందగోపాల్ వినతి పత్రం అందజేశారు అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రానున్న దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని కల్తీ మద్యం ఏరులై పారే అవకాశం ఉన్నందున నిఘను మరింత పటిష్టం చేసి కల్తీ మద్యాన్ని నిరోధించాలన్నారు, మద్యం వినియోగదారులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలని అన్నారు, జిల్లాలో అనుమానిత కల్తీ మద్యాన్ని విక్రయించే వారిపై , కల్తీ కళ్ళు( గుడుంబా) తయారీపై మరియు ముడి సరుకు విక్రయదారులపై నిఘ పెట్టాలన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, జిల్లాలో విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపులను కట్టడి చేయాలన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమంలో దాగం శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు, కుమ్మరి కృష్ణ చైతన్య మంచిర్యాల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


