Deputy Commissioner : సమిష్టి కృషితో స్వచ్చత సాధ్యo

TRINETHRAM NEWS

రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గురువారం గోదావరి నది పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన “ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్: నేషన్‌వైడ్ వాలంటరీ శ్రమధాన్” కార్యక్రమంలో నగర పాలక సంస్థ సిబ్బంది , మెప్మా సిబ్బంది పాల్గొని సమగ్ర పరిశుభ్రత డ్రైవ్‌ చేపట్టి ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ , చెత్త ఏరి వేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ , పరిశుభ్రతా క్రమ శిక్షణ సంస్కృతిని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక మైలు రాయి అని అన్నారు. ఈ కార్యక్రమం సమిష్టి కృషి శక్తి ని నిరూపించిందని అన్నారు. నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ , మెప్మా సి ఓ లు ఊర్మిళ , శ్వేత . ప్రియ దర్శిని , వార్డు అధికారులు , సానిటరీ జవాన్లు , ఎకో వారియర్స్ ప్రతినిధులు శివ కృష్ణ , కరుణా కర్ , మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cleanliness is possible with collective effort

You cannot copy content of this page

Scroll to Top