త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి బంటారం తహసీల్దార్ ఆఫీస్ ముందు దళిత రైతులతో సిపిఎం లో ధర్నా బోపునరం గ్రామంలోనీ సర్వే నంబర్ 69లో గల ప్రభుత్వ భూమూలలో మైనింగ్, బీడు భూములకు రైతు బందు ఆపాలి. భూస్వాముల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి. దళితుల భూమీ కబ్జ చేసి,అక్రమ పట్టాలు రద్దు చెయ్యాలిఅక్రమ పట్టచేసుకొని నవాజ్ రెడ్డి బక్కరెడ్డి మాణిక్ రెడ్డి లు 3ఏండ్లుగా ఇబ్బందులు పెడుతున్న గ్రామ పెత్తందారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సిపిఎం డిమాం డ్
నేడు వికారాబాద్ జిల్లా బంటారo మండల ఆఫీస్ ముందు ధర్నా చెయ్యడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ బోపునరం గ్రామంలో సర్వే నంబర్ 69లో గల 187 ఎకరాల భూమిలో పేదలకు పట్టాలు ఇచ్చారు. గత 60 ఏండ్ల క్రితం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 1958లో ప్రభుత్వం భూపంపిణీ చేశారు. అప్పటినుండి దళితులు, ఇతరులు సాగులో ఉండి పంటలు పండించుకుంటున్నారు. దళిత కులానికి చెందిన బాలప్ప కు కూడా 5ఎకరాలు ప్రభుత్వ భూమి పంపిణీ చేసినారు. అప్పటినుండి దళితులు సాగులో ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు దళితుల భూమి 2ఎకరాలు అక్రమంగా పట్టా చేసుకొని, పైగా నవాజ్ రెడ్డి బక్కరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు లక్ష్మారెడ్డి, ప్రదీప్ రెడ్డిలు పక్కా పొలాల వద్ద ఒంటరిగా ఉన్న దళిత మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ దళితులపై దాడులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నరూ. వీళ్ళపై చర్యలు తీసుకోవాలనీ పిర్యాదులు చేసిన పోలీస్ అధికారులు చర్యలు తీసుకోలేదు.
దళితులకు కేటాయించిన భూములలోకి గ్రామ పెత్తందారులు అక్రమంగా ప్రవేశించి దొంగ పట్టాలు చేసుకుని ఖాళీ గా ఉన్న భూములకు రైతుబంధు, బ్యాంకు లోన్లు తీసుకుంటున్నరూ, వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి దళితుల భూమి దళితులకు ఇవ్వాలని, అనేకసార్లు బంటారం మండల అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయలేదు. అందుకే నేడు రైతుల ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్న, దళితుల సమస్య ఎక్కడ వేసిన గోంగడి అక్కడే ఉంది. ఇప్పుడు ఉన్న మండల అధికారులు, జిల్లా కలెక్టర్ బోపునరం సర్వే నంబర్ 69లో గల దళితుల భూములను, మైనింగ్ భూములను సందర్శించి దళితుల భూములు దళితులకు ఇవ్వాలి. మిగులు ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము లేనిచో మండల, జిల్లా కార్యాలయం ముందు రైతులతో రైతు సంఘం ,సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు బాలప్ప కుటుంబ సభ్యులు పెంటప్ప ఆనందం విజయ్ కుమార్ ప్రవీణ్ కుమార్ అశోక్ కుమార్ అజయ్ నర్సింలు సత్యాయా రాములు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ నర్సింలు లక్ష్మయ్య శ్రీనివాస్ ప్రవీణ్ అరుణ కృష్ణ పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


