Mukunda Nageshwar : మాటల్లో తప్ప చేతల్లో కనిపించని పరిగి నియోజకవర్గ అభివృద్ధి

TRINETHRAM NEWS

ముకుంద నాగేశ్వర్ టీజేఏసీ చైర్మన్ వికారాబాద్ జిల్లా.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత కూడా పరిగి నియోజక వర్గానికి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా గోదావరి నది నుండి 2008లో శంకుస్థాపన చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నీళ్లు మరియు కృష్ణానది నుండి 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నీళ్లు రాలేదు

2018లో ప్రభుత్వం సుమారు 6 కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న లక్నాపూర్ ప్రాజెక్ట్ సుందరీకరణ మరియు పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఉన్న నీళ్లకు రెట్టింపు నీళ్లు ప్రాజెక్టులో ఉండేవి. పరిగి మున్సిపాలిటీలో పనులే ప్రారంభం కాని 2015లో మంజూరైన రైతు బజార్ మరియు అసంపూర్తిగా ఉన్న 2022లో మంజూరైన వెజ్ నాన్ వెజ్ మోడల్ రైతు మార్కెట్ ఇంకెప్పుడు రైతులకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి

పరిగిలో ప్రజల దశాబ్దాల పోరాట ఫలితంగా నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి, విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి చర్యలే చేపట్టని ప్రభుత్వం నాణ్యమైన ఉత్తమ ఉన్నత విద్యను విద్యార్థులకు ఎలా అందిస్తుంది. తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కొరకు ఎన్నో మార్పులు చేపట్టినా పరిగి నియోజకవర్గంలో నూతన పరిగి రెవెన్యూ డివిజన్, కంకల్ మరియు దిర్సంపల్లి నూతన మండలాలు, బాబాపూర్ మరియు ఇతర అవసరం ఉన్న గ్రామ పంచాయితీల ఏర్పాటు ఇంకా జరగకుండా ఉంటే సుపరిపాలన ఎలా సాధ్యమవుతుంది.

ఎనిమిది ఏళ్ల క్రితం ఏర్పడిన పరిగి నూతన మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారానికే తప్ప పన్నుల భారం పెరిగినట్టుగా పట్టణ అభివృద్ధి సూచికలైన అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, పార్కుల అభివృద్ధి, పట్టణ సుందరీ కరణ మరియు నూతన మున్సిపల్ భవన నిర్మాణము మొదలగు మౌలికవసతుల కల్పనలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని చెప్పాలి

తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి పరిగి మున్సిపల్ లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, దోమ మండలం సంజీవ్ నగర్ లోని సంజీవ స్వామి ఆలయం అభివృద్ధి మరియు నియోజకవర్గమంతా ఉన్న ఆలయం భూముల పరిరక్షణకు ప్రభుత్వ చర్యలు శూన్యం. విద్యాభివృద్ధిలో భాగంగా పరిగిలో ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటిఐ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం ప్రజలు ఇంకెంతకాలం వేచి చూడాలి

రైతుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ప్రతిపాదనలే లేని పరిగిలో కోల్డ్ స్టోరేజీ గోడౌన్ ఏర్పాటు ఎప్పటివరకు జరుగుతుంది. సుమారుగా ఒకే రకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్ వరంగల్ హైవే ఎప్పుడో పూర్తయింది కానీ హైదరాబాద్ పరిగి హైవే ఎప్పటికీ పూర్తవుతుందో ప్రభుత్వమే ప్రజలకు చెప్పాలి. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయినా ఇప్పటికీ పటిష్టమైన గుంతలు లేని మంచి శాశ్వత రోడ్లు లేని ఎన్నో గ్రామాలకు రోడ్లు వేయడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది

ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నాయకులు కావున ప్రజలందరూ అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వంతో పని చేయించుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.
ముకుంద నాగేశ్వర్, టీజేఏసీ చైర్మన్ వికారాబాద్ జిల్లా

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Development of Parigi constituency

You cannot copy content of this page

Scroll to Top