పారదర్శకంగా పనులు చేయాలి…
చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి..
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మునిసిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి పారదర్శకత తో త్వరీతగతంగా పూర్తి చేయాలని మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు.మండపేట పట్టణం 8వ వార్డులో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బి పి ఎస్ గ్రాంట్ రూ.4.10లక్షల తో డ్రైన్ పనులు చేపట్టామన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్,కొడమంచిలి భాస్కరరావు,దార్ల అబ్రహం,తాతపూడి సురేష్,పోలమాల సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


