Bathukamma Celebrations : మండల పరిషత్ ప్రాథమికపాఠశాలలో బతుకమ్మ సంబరాలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి )సెప్టెంబర్ 20  త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు .బాల బాలికలు గొబ్బెమ్మ చుట్టూ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ముడి శ్రీను మాట్లాడుతూ ముందస్తు బతుకమ్మ సంబరాలు వలన పిల్లలకు మానసిక సంతోషాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు .మరియు చెరుకుపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ముడి శ్రీను కు నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చేతుల మీదుగా అందుకొని సన్మానించబడిన ప్రధానోపాధ్యాయులు ముడి శ్రీను ను చెరుకుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో గ్రామ యువకుల మరియు పాఠశాల సిబ్బంది రేణుకా దేవి రేణుక బాబు రాజేశ్వరి శిల్పారెడ్డి ఆధ్వరంలో శాలువా తో సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bathukamma celebrations

You cannot copy content of this page

Scroll to Top