తేదీ : 20/09/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమల వెంకటేశ్వర సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘా ల్ తెలిపారు. అక్కడకు వచ్చే అటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సూక్ష్మ క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉదయం సమయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు , సాయంత్రం సమయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి సమయం పన్నెండు గంటల వరకు గరుడ సేవ, అదేవిధంగా రాత్రి సమయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటుందన్నారు. కాగా ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై నాలుగు వ తేదీ న జరిగే అటువంటి ద్వజ రోహనం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


