తేదీ : 19/09/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు సమక్షంలో ముగ్గురు వైసిపి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్లు మర్రి. రాజశేఖర్, కర్రీ. పద్మశ్రీ, బల్లి. కళ్యాణ్ చక్రవర్తి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లకు కండువాలు కప్పి ముఖ్యమంత్రి తన పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వాళ్ల పదవులకు రాజనామా చేయగా, మండలి చైర్మన్ ఆమోదం తెలపలేదు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటమయం చేస్తే కూటమి ప్రభుత్వం నిరంతరం ఉదయించే సూర్యుడు వలె వెలుగునిస్తుందని ఉన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు కులం, మతం, భాష, పార్టీ భేదం లేకుండా ఈ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. అందుకని ఆ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చినందుకు మాకు జన్మ ధన్యమైందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
