MLA Bathula Lakshma Reddy : కుమారుడి రిసెప్షన్ ఖర్చును రైతుల కోసం ఇచ్చిన మిర్యాగూడ ఎమ్మెల్యే!

TRINETHRAM NEWS

Trinethram News : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. రూ. 2 కోట్లను తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. ల లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం గా అందజేయాలని ఎమ్మెల్యే కోరారు.

ఇటీవల ఎంఎల్ ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి అందు కోసం రెండు కోట్లు ఖర్చుచేయాలనుకున్నారు. కానీ కానీ రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ డబ్బులను ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి అందించారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని సీఎం అభినందించారు.

అయితే యూరియా విషయంలో బత్తుల లక్ష్మారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన గన్మెన్ ఓ లారీ యూరియాను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయారు. ఈ అంశంపై దుమారం రేగింది. ఇప్పుడు ఆయన ఇలా ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా ఇవ్వాలని రెండు కోట్లు ఇవ్వడం.. మిర్యాలగూడ నియోజకవర్గంలో చర్చనీయాంశమయింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA donates son's reception expenses for farmers!

You cannot copy content of this page

Scroll to Top