గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు స్థానిక RCOA క్లబ్బులో గోదావరిఖనిలో జీడీకే 5 ఇంక్లైన్ లొ పనిచేసిన ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కార్మికులు మరియు అధికారులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోషిక మల్లేష్ మాజీ మేనేజర్ ఫైన్ ఇంక్లైన్ , రామయ్య , సంజీవ్ కుమార్ మరియు రాజ్ కుమార్ ఇంజనీర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యం నిర్వహకులు బత్తుల సూర్యనారాయణ, మంచోజు బ్రహ్మచారి, కన్నం తిరుపతి, మహమ్మద్ వహీద్, పాసి కంటి సందీప్ , ముడతనపల్లి సత్యనారాయణ, కుమారస్వామి, దేశినేని ప్రసాద్ ,పరికిపండ్ల మొగిలి, ఉప్పు మల్లయ్య. మానుపాటి తిరుపతి. భక్తి శ్రీనివాస్ పదవి విరమణ కార్మికులు మరియు ఇప్పుడు వివిధ గనిలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కలిసి ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా గడిపారు. గనిలో పనిచేసినప్పుడు జరిగిన సంగతులు గత స్మృతులు స్మరించుకుంటూ సమయం ఆనందంగా గడపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి సన్మానం చేయడం జరిగింది . జ్ఞాపక సమర్పించి శాలువాతో సత్కరించడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


