తేదీ : 16/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం మూవీస్); చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, గ్రామంలో స్థిర నివాసం కలిగి ఉండటం వంటి తైదుల. లలిత కుమారి హేచ్/ఆఫ్ బాలస్వామి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు గత ఇరవై సంవత్సరాల నుండి మోక్షం లేదు. ప్రభుత్వాలు మారిన ఈ రోడ్డు వర్షం వస్తే బురద, నడవాలంటే జారుడుబల్ల ల కింద పడిపోవడం జరుగుతుంది. పంచాయితీ వాళ్లను సంప్రదించిన ఈ రోడ్డుకు వచ్చినటువంటి నిధులను మింగేస్తున్నారో ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. కనీసం సీసీ రోడ్ వెయ్యడానికి కూడా నోచుకోలేని విధంగా
ఈ గ్రామం ఉంది. చీకటి పడగానే కరెంట్ లేని పరిస్థితిలో అయోమయంగా ఉంటుంది ఈ రోడ్డు. పెద్ద పెద్ద చెట్లు. పిచ్చి పొదలతో నిండి ఉంది. పాములు , తేళ్ళు, విషపురుగులాంటివి తిరుగుతున్నాయి. నడవాలన్న, లేక ఏదైనా వాహనం మీద వెళ్ళాలన్నా మెయిన్ సెంటర్ కి వెళ్ళాలన్నా ఇబ్బందిగానే ఉన్నది. దయచేసి గ్రామపంచాయతీ వాళ్ళు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఈ దారికి సీసీ రోడ్డు వేయాలని కూటమి ప్రభుత్వానికి ప్రజలు మర్యాదపూర్వకంగా తెలుపుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


