Collector Koya : విలువిద్య క్రీడలో బంగారు పతకం సాధించడం అభినందనీయం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

పెద్దపల్లి, ఆగస్టు-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శనివారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  తన చాంబర్ లో ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితను సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత కెనడా వేదికగా జరిగిన విన్ని పెగ్ 2025 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20 వయసు గల తానిపర్తి చికిత అగ్రశ్రేణి క్రీడాకారులను మట్టి కరిపించి స్వర్ణ విజేతగా నిలిచి భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్ గా సరికొత్త చరిత్ర సృష్టించడం మనందరికీ గర్వ కారణమని అన్నారు తానిపర్తి చికిత సాధించిన విజయం జిల్లాలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచి మరింత ఎత్తు అయిన శిఖరాలను అధిరోహించేందుకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ‌క్రీడాకారిణి భవిష్యత్తులో ఆర్చరీ లో ఒలంపిక్స్ లో కూడా రాణించి భారత దేశానికి, పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తోడ్పాటు జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్,ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్ , పెద్దపల్లి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్త్యాల రవీందర్ సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ అమెరిశెట్టి తిరుపతి , కుమార్ , సుల్తాన్పూర్ గ్రామస్తులు , తదితరులు పాల్గోన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Koya Sri Harsha

You cannot copy content of this page

Scroll to Top