National Health Mission : కొమురం భీం ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ లో జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ సమావేశం

TRINETHRAM NEWS

ఆసిఫాబాద్ జిల్లా. 31ఆగస్టు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్.హెచ్.ఎం ఆల్ క్యాడర్స్ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు లో నిర్వహించడం జరుగుతుందని, కావున ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని, జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు భోగే ఉపేందర్, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మధుకర్ తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ పాల్గొంటున్నారనీ వారు పేర్కొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Health Mission All Cadres Meeting

You cannot copy content of this page

Scroll to Top