Mandapalli Ravikumar : ఎస్ సి వార్డులంటే వివక్ష

TRINETHRAM NEWS

మందపల్లి రవికుమార్…

త్రినేత్రం న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట, మండపేట మునిసిపాలిటీ లో ఎస్ సి వార్డుల పై వివక్ష చూపించడం తగదని ఎనిమిదో వార్డు వైసిపి కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ అన్నారు. గతంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ వార్డు లో కమ్యూనిటీ హాల్ కు రూ 39 లక్షల రూపాయలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఈ పనులు చేపట్టాలని గతంలో తను కౌన్సిల్ లో కోరగా ఎస్ సి నిధులు వస్తాయని వాటితో నిర్మిద్దామని చెప్పారని పేర్కొన్నారు.

అన్ని వార్డుల్లో అన్ని పనులు చేస్తున్నారని ఒక్క ఎస్ సి ప్రాంత వార్డుల్లో పనులు జరగడం లేదని వాపోయారు. కులాల వారిగా వారి పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ సి ల పట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపించారు.అదే వార్డు లో అభివృద్ధి పనులకు టెండర్ లు ఖరరైనా ఇప్పటికీ పనులు చేపట్టడం లేదని పేర్కొన్నారు.ఇతర వార్డుల్లో ఆఘమేఘాలపై చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపడతారా లేక రద్దు చేస్తారా అంటూ ప్రశ్నించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Discrimination against SC wards

You cannot copy content of this page

Scroll to Top