శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు, జయంతి
త్రినేత్రం న్యూస్, అనపర్తి.. పురస్కరించుకొని జి.బి.ఆర్ విద్యాసంస్థలలో తెలుగు భాషాదినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమం జి.బి.ఆర్ గ్రూఫ్ ఆఫ్ స్కూల్స్ డీన్ జి.హరిప్రసాద్, హైస్కూల్ హెచ్.ఎం.రామారావు, ప్రైమరీ హెచ్.ఎం. భువనేశ్వరి, ప్రీ-ప్రైమరీ హెచ్.ఎం.కామాక్షి, ఇంఛార్జులు వెంకటరెడ్డి, మహర్షి వెంకటరెడ్డి, మరియు అకడమిక్ కో-ఆర్డినేటర్ ప్రశాంతి రెడ్డిగార్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంలో డీన్ మాట్లాడుతూ,
గిడుగువారు తెలుగు భాషకు గొడుగులాంటి వారని, తెలుగు భాష అత్యంత తీయనైన భాష అని, మన భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేసారు. విద్యార్థులకు కృష్ణదేవరాయల, వారి ఆస్థాన కవుల గొప్పదనాన్ని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల అష్టదిగ్గజ ప్రదర్శన కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుపాటలు,తెలుగుసంప్రదాయ నృత్యాలు,తెలుగుపద్యాలు,కవితలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వివిధ పోటీల్లో ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేయబడ్డాయి.ఈ సందర్భంగా జి.బి.ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ తేతలి ఆదిరెడ్డి(కొండ బాబు) విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


