నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా, పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం,
త్రినేత్రం న్యూస్, ఆగస్టు 29. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణం, దుడ్డివారిఅగ్రహారం వద్ద, నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఉదయం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నందు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ. యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ను రాష్ట్ర టిడిపి ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెట్ల వెంకటరమణబాబు ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక అసోసియేషన్ అధ్యక్షులు అల్లాడ శరత్ బాబు, ఆర్గనైజేషన్ సెక్రెటరీ, పప్పుల శ్రీరామ్ మూర్తి, డీఎస్డీవో పి.ఎస్. సురేష్ కుమార్, పవర్ లిప్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వై. పద్మరాజు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గరపాటి చంద్రశేఖర్, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకటసుబ్రహ్మణ్యం, కల్వకొలను వెంకటరమణ, సి.వి.రామన్ స్కూల్ డైరెక్టర్ రమణం వేణుగోపాల్, దివితేజ స్కూల్ కరెస్పాండెంట్ ఎం. ప్రతాప్, కంకిపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


