కమిషనర్ ( ఎఫ్ఎసి )జె, అరుణ శ్రీ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ ( ఎఫ్ఎసి ) జె, అరుణ సూచించారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళ వారం ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ విగ్రహాలను రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను ప్రోత్సహించడానికి కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐ బి కాలనీ లో మరుగు దొడ్డి శుభ్రం చేశారు , ఫైవ్ ఇంక్ లైన్ లో కళా జాతా ల ప్రదర్శన నిర్వహించి పరిసరాల పరిశుభ్రత , తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించడం , దోమ కాటు బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రతలపై పాటలు పాడి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


